ఐదు నెలల్లో 50 మంది ఆత్మహత్య:
రాష్ట్రంలో ఇసుక కొరత ను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికుల లో భరోసా పెంచేందుకు చంద్రబాబు గురువారం 12 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నారు. విజయవాడలోని ధర్నాచౌక్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగే ఈ దీక్షను జయప్రదం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఐదు నెలల్లో 50 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం చరిత్రలో ఎన్నడూ లేదని ఆయన మండిపడ్డారు. గుంటూరు కృష్ణ జిల్లాలో తెదేపా నాయకులు బుధవారం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.ఇసుకను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


Comments
Post a Comment