వైద్యుల పై దాడి చేస్తే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష:
ఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులు వైద్య సిబ్బంది పై దాడులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకువచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది .
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
వైద్యులు సిబ్బందిని తీవ్రంగా గాయపరిచిన వారికి మూడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష రూ,2 లక్షల నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించాలని ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు .
దాడి చేసి ఆస్తులకు నష్టం కలిగించే వారికి ఆరు నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష రూ 50 వేల నుంచి రూ 5 లక్షల వరకు జరిమానా విధించాలని పేర్కొన్నారు.



Comments
Post a Comment