ఇసుక అక్రమాలకు రెండు లక్షలు  జరిమానా 2 ఏళ్లు జైలు శిక్ష:


ఇసుక అక్రమ నిల్వ మార్కెటింగ్ పునర్ విక్రయం వంటి చర్యలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష రూ 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గనుల చట్టం లో సవరణ కు కు కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది .అనధికారిక లేఅవుట్ల లోని 1.5 లక్షల స్థలాలన్నీ క్రమబద్దీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా మద్దతు ధర కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సేకరణ ,నిల్వ కార్యక్రమాల నిర్వహణకు కొత్తగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ( ఏఈ ఎం సి ఏ) ఏర్పాటు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు .ఆమోద ముద్ర వేసింది ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు వాటిని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో తెలిపారు. వివరాలు మంత్రి మాటల్లో అక్రమంగా డబ్బు సంపాదించాలన్న రాజకీయ కోణంలో మరికొందరు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేసి తిరిగి అమ్ముతున్నారు అక్రమాలపై విక్రయించే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంది.

Comments

Popular Posts