రాయలసీమ ఎత్తిపోతలు:
రాయలసీమ జిల్లాలోని బీడు బారిన పొలాలను సస్యశ్యామలం చేసేందుకు నూతన ఎత్తిపోతలు పథకాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు దీని ప్రకారం ఎత్తిపోతల దాదాపు 30వేల క్యూసెక్కుల నీటిని ఎత్తి పోసి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లో పోసి రాయలసీమ జిల్లాలకు జలాలను అందించాలని యోజన .పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ప్రస్తుతం 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకువెళ్లే సామర్థ్యం ఉండగా దాన్ని పెంచితేనే తక్కువ రోజుల్లో ఎక్కువగా శ్రీశైలం నీటిని తీసుకువెళ్లగా అనే ఉద్దేశంతో దీనికి రూపకల్పన చేశారు. 40రోజుల వరద సమయంలోనే అధిక జలాలు తీసుకువెళ్లారు కార్యాచరణ రూపొందించాలని గతంలో ముఖ్యమంత్రి సూచించిన మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు .ప్రస్తుతం శ్రీశైలంలో 854 అడుగుల వద్ద మాత్రమే సీమ జిల్లాలకు నీటిని తీసుకువెళ్లే వీలుంది కొత్త పథకంలో వద్ద 794 అడుగుల వద్ద కూడా 30వేల క్యూసెక్కుల తీసుకునేలా భారీ ఎత్తిపోతల చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు దీనిని ముఖ్యమంత్రి జగన్ బుధవారం నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో అధికారులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టదలచిన 20 నుంచి 25 ప్రాజెక్టుల అవసరం ప్రాధాన్యతతో తో బాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం గోదావరి కృష్ణ అనుసంధానం కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మాణం గుండ్రేవుల ఎత్తిపోతల కడప జిల్లాలో కొత్త జలాశయాలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులపై ఈ చర్చ జరిగింది . జలవనరులు శాఖ అధికారులు రూపొందించిన ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు వారీగా సమీక్షించారు.



Comments
Post a Comment